లోక్ సభలో మిథున్ రెడ్డి కోర్టులను కించపరిచేలా మాట్లాడారు: టీడీపీ ఎంపీ రామ్మోహన్
- కోర్టులపై ఆరోపణలకు పార్లమెంటును వేదికగా చేసుకున్నారని వెల్లడి
- న్యాయస్థానాలపై నిందలు సరికాదన్న యువ ఎంపీ
- ఆధారాలు లేని ఆరోపణలతో కేసులు నిలబడడంలేదని వివరణ
నాడు అమరావతిలో రాజధాని పెడతామంటే ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఒప్పుకున్నారని తెలిపారు. జగన్ అప్పుడొక మాట, ఇప్పుడొక మాట చెప్పి కొత్త స్కామ్ కు తెరదీశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయని అన్నారు. సీబీఐకి కొన్ని కేసులు ఇచ్చి చేతులు దులుపుకోవాలని జగన్ సర్కారు చూస్తోందని రామ్మోహన్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలోని ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కేవలం హిందూ ఆలయాలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.