Sushant Singh Rajput: సారా, రియా, శ్రద్ధా కపూర్ తరచుగా సుశాంత్ ఫాంహౌస్ కు వచ్చేవారు: మేనేజర్ వెల్లడి

Sushant farm house manager tells more details

  • మొదట్లో సారా అలీఖాన్ ఎక్కువగా వచ్చేదన్న ఫాంహౌస్ మేనేజర్
  • ఆ తర్వాత రియా రాక ఎక్కువైందని వివరణ
  • పార్టీల్లో కచ్చితంగా స్మోకింగ్ పేపర్లు ఉండేవని వెల్లడి

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న తన ఫ్లాట్ లో విగతజీవుడిలా కనిపించడం తెలిసిందే. అప్పటినుంచి సుశాంత్ కు సంబంధించి ఎన్నో విషయాలు మీడియాలో వస్తున్నాయి. తాజాగా, సుశాంత్ ఫాంహౌస్ మేనేజర్ రయీస్ ఆసక్తికర వివరాలు తెలిపారు.

లోనావాలా ఐలాండ్ లో ఉన్న సుశాంత్ ఫాంహౌస్ కు హీరోయిన్లు సారా అలీఖాన్, రియా చక్రవర్తి, శ్రద్ధా కపూర్ తరచుగా వచ్చేవారని, అంతా కలిసి పార్టీలు చేసుకునేవారని వెల్లడించారు. పార్టీ జరిగిన ప్రతిసారి స్మోకింగ్ పేపర్లకు ఆర్డర్ ఇచ్చేవారని, ఆ స్మోకింగ్ పేపర్లతో ఏంచేస్తారో తనకు తెలియదని రయీస్ వివరించాడు. కానీ పార్టీ వస్తువుల లిస్టులో మాత్రం స్మోకింగ్ పేపర్లు తప్పకుండా ఉండేవని చెప్పాడు.

లాక్ డౌన్ ప్రకటించకముందు సుశాంత్ వారంలో ఒకట్రెండు సార్లు ఫాంహౌస్ కు వచ్చేవాడని తెలిపారు. మొదట్లో సుశాంత్ వెంబడి సారా అలీఖాన్ ఎక్కువగా కనిపించేదని, ఆ తర్వాత రియా కూడా ఫాంహౌస్ కు రావడం మొదలుపెట్టిందని వివరించారు.

అంతేకాదు, రియా తల్లిదండ్రులు, సోదరుడు షోవిక్ కూడా సుశాంత్ ఫాంహౌస్ లోనే బర్త్ డే, ఇతర వేడుకలు జరుపుకునేవారని పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయాన్ని సుశాంత్ ఫాంహౌస్ లోనే గడపాలని నిర్ణయించుకున్నా, ఆ తర్వాత తన ఆలోచన మార్చుకున్నాడని తెలిపారు.

Sushant Singh Rajput
Farm House
Manager
Raees
Sara Ali Khan
Rhea Chakraborty
Shradha Kapoor
  • Loading...

More Telugu News