అల్లు అర్జున్ 'పుష్ప' షూటింగ్ ఇక కేరళ అడవుల్లోనే!
- ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో బన్నీ 'పుష్ప'
- లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్
- మహబూబ్ నగర్ అడవుల్లో షూటింగుకి ప్లాన్
- డిసెంబర్ నుంచి కేరళ అడవులలోనే షూట్
ఇక పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడవని భావించి ఈ చిత్రం షూటింగును మహబూబ్ నగర్ అడవుల్లో చేద్దామని అంతా సిద్ధం చేసుకున్నారు. తక్కువ మంది యూనిట్ సభ్యులతో .. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్కడ షూటింగ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పటికీ, ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు విరమించుకున్నట్టు తెలుస్తోంది. మొదట్లో అనుకున్నట్టుగా కాస్త ఆలస్యమైనా కేరళ అడవుల్లోనే చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో డిసెంబర్ నుంచి కేరళ అడవుల్లో షూటింగ్ నిర్వహిస్తారని సమాచారం.
అల్లు అర్జున్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని బాణీలను కూడా ఆయన సిద్ధం చేసినట్టు చెబుతున్నారు.