సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పాయల్ రాజ్ పుత్ కల నెరవేరిందట!
- అఖిల్ సినిమా కోసం రష్మిక?
- సాయితేజ్ సినిమా పూర్తయింది
* అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక నటించే అవకాశాలు వున్నాయి. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.
* సాయితేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం షూటింగ్ ముగిసింది. ఇటీవల చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలతో మొత్తం పూర్తయిందని యూనిట్ తెలిపింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తారు. ఇందులో నభా నటేష్ కథానాయికగా నటించింది.