పబ్జీకి దీటుగా కొత్త గేమింగ్ యాప్ 'ఫౌజీ'... అక్షయ్ కుమార్ ప్రకటన
- ఇటీవల పబ్జీని నిషేధించిన కేంద్రం
- ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా నూతన గేమింగ్ యాప్
- మెంటార్ గా వ్యవహరిస్తున్న అక్షయ్ కుమార్
ఈ గేమ్ ను బెంగళూరుకు చెందిన ఎన్ కోర్ గేమ్స్ సంస్థ రూపొందించింది. అక్షయ్ కుమార్ మెంటార్ గా వ్యవహరిస్తున్నారు. దీనిపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ, 'ఫౌజీ' గేమింగ్ యాప్ ద్వారా వినోదం మాత్రమే కాదని, భారత సైనికుల త్యాగాలను కూడా తెలియజేయబోతున్నామని వివరించారు. 'ఫౌజీ' యాప్ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం 'భారత్ కా వీర్' ట్రస్టుకు అందజేస్తామని వెల్లడించారు.