సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- శ్రీలంకలో షూటింగ్ ప్లాన్ చేస్తున్న మణిరత్నం
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా అప్ డేట్
- డిసెంబర్ నుంచి గోపీచంద్ బయోపిక్ షూటింగ్
* ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహించుకుంటున్న ఈ చిత్రం పల్నాడు నేపథ్యంలో సాగే కథతో రూపొందుతుందని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని సంస్థతో కలసి నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
* బ్యాడ్మింటన్ చాంపియన్, ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితకథ తెరకెక్కనున్న సంగతి విదితమే. హీరో సుధీర్ బాబు టైటిల్ రోల్ పోషించే ఈ బయోపిక్ షూటింగ్ డిసెంబర్ నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. ఈ విషయాన్ని తాజాగా సుధీర్ బాబు వెల్లడించాడు.