'ఆదిపురుష్' కోసం కొత్త విద్యను నేర్చుకోనున్న ప్రభాస్
- విలువిద్యను నేర్చుకోబోతున్న ప్రభాస్
- థాయ్ లాండ్ నుంచి రానున్న శిక్షకుడు
- పాత్ర కోసం శరీరాకృతిని మార్చుకోనున్న ప్రభాస్
ఈ సినిమా కోసం ప్రభాస్ విలువిద్యను నేర్చుకోబోతున్నాడని సమాచారం. తన పాత్రకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవాల్సి ఉంది. విలువిద్యలో ప్రభాస్ కు ట్రైనింగ్ ఇచ్చేందుకు థాయ్ లాండ్ నుంచి శిక్షకుడిని రప్పించే అవకాశం ఉందని చెపుతున్నారు. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. రూ. 350 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. మొత్తం ఐదు భాషల్లో సినిమా తెరకెక్కబోతోంది.