Nabha Natesh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • నితిన్ సరసన నాయికగా నభా నటేష్  
  • 'రాధే శ్యామ్'కి సాహో సంగీత దర్శకుడు 
  • మరోసారి 'ఇస్మార్ట్ శంకర్' కాంబినేషన్    
Nabha Natesh opposite Nithin in Andha dhun remake

*  హిందీలో హిట్టయిన 'అంధాధున్' చిత్రాన్ని నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కథానాయికగా నభా నటేష్ ను తాజాగా ఎంపిక చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాదే శ్యామ్' చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తాడు. ఆమధ్య ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రానికి జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ అక్టోబర్ నుంచి జరుగుతుంది.
*  పూరి జగన్నాథ్, రామ్ కలయికలో ఇటీవల వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా మంచి హిట్టయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్లో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.

More Telugu News