రూ. 350 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ మూవీ 'ఆదిపురుష్'.. టీజర్ విడుదల!
- ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్
- ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్న బాలీవుడ్
- ఓంరావుత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త చిత్రం
ఈ చిత్రానికి 'ఆదిపురుష్' అనే టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. 'చెడుపై మంచి సాధించే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం' అంటూ సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ప్రభాస్, ఓంరావుత్ విడుదల చేశారు. ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా తెరకెక్కనుంది.
