మహేశ్ బర్త్ డే రోజున సర్కారు వారి 'పాట'!
- మహేశ్ బాబు తాజా చిత్రం 'సర్కారు వారి పాట'
- ఈ నెల 9న మహేశ్ బాబు జన్మదినం
- టైటిల్ ట్రాక్ ను విడుదల చేసే ప్రయత్నాలు
ఇదే కోవలో ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్ర నిర్మాతలు కూడా తమ హీరో మహేశ్ బాబు జన్మదినం రోజున ఓ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. ఈ నెల 9న మహేశ్ జన్మదినం. ఈ సందర్భంగా 'సర్కారు వారి పాట' చిత్రం నిర్మాతలు ఈ సినిమా నుంచి టైటిల్ సాంగును వదలనున్నట్టు తెలుస్తోంది. అభిమానులను ఈ పాట బాగా అలరిస్తుందని భావిస్తున్నారు.
పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ కూడా మరో నాయికగా నటిస్తుందని సమాచారం.