'సత్యమేవ జయతే..' అంటూ వీడియోలో కన్నీటిపర్యంతమైన రియా చక్రవర్తి
- నిజం ఎప్పటికైనా గెలుస్తుందంటూ వ్యాఖ్యలు
- మీడియాలో తనపై దారుణ కథనాలు వస్తున్నాయని వెల్లడి
- లాయర్ల సూచన మేరకు మౌనంగా ఉంటున్నానని వివరణ
ఆ వీడియోలో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని అన్నారు. "నాకు దేవుడిపైనా, న్యాయ వ్యవస్థపైనా బలమైన నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో నాపై భయంకరమైన వార్తలు ప్రసారం చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున వాటిపై స్పందించవద్దని మా లాయర్లు చెప్పడంతో మౌనంగా ఉంటున్నాను. సత్యమేవ జయతే" అంటూ వీడియో ముగించారు.