బిగ్ బాస్-4లో తాను పాల్గొంటున్నట్టు వస్తున్న వార్తలపై తరుణ్ స్పందన
- త్వరలో బిగ్ బాస్ నాలుగో సీజన్
- హీరో తరుణ్ కూడా పాల్గొంటున్నట్టు ప్రచారం
- ఊహాగానాలకు తెరదించిన తరుణ్
దీనిపై తరుణ్ స్పందించడమే కాదు, ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలోనూ, కొన్ని దినపత్రికల్లోనూ తన గురించి ప్రచారం జరుగుతోందని, తాను బిగ్ బాస్ లో పాల్గొంటున్నట్టు వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
"నేను ఈ రియాల్టీ షోలో చేయడం లేదు. నాకు దీనిపై ఏమంత ఆసక్తి కూడా లేదు. ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దు. అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు, కరోనా కాలంలో ఇంటిపట్టునే క్షేమంగా ఉండండి" అంటూ పేర్కొన్నారు.