కొరటాలతో చేయడానికే మొగ్గు చూపుతున్న బన్నీ
- ప్రతి సినిమాలోనూ సందేశాన్ని ఇచ్చే కొరటాల
- ప్రస్తుతం సుకుమార్ తో 'పుష్ప' చేస్తున్న బన్నీ
- అల్లు అర్జున్ కోసం కథ రెడీ చేస్తున్న శివ
ప్రస్తుతం అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గా కథను కొరటాల శివ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల వీరిద్దరి మధ్యా చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక ఆయన చేసేది కొరటాల చిత్రమే అవుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోపక్క, 'యాత్ర' ఫేం మహి వి.రాఘవ కూడా బన్నీతో ఓ సినిమా చేయడానికి స్క్రిప్టును రెడీ చేస్తున్నాడు.