విశాఖ ఫార్మా ప్రమాదంపై హోం మంత్రి సుచరిత దిగ్భ్రాంతి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
- పోలీసులు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న హోం మంత్రి
- ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు చెప్పిన కార్మిక మంత్రి జయరాం
- ప్రాథమిక విచారణ అనంతరం కారణాలు తెలుస్తాయన్న మంత్రి
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. కాగా, ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేసే కార్మికుడు శ్రీనివాసరావు (45) మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో మల్లేశ్ అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు గాజువాక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.