దయచేసి ఇటువంటి రూమర్లను వ్యాప్తి చేయడం ఆపండి: 'రణ్‌బీర్‌కు కరోనా' వార్తలపై రిద్దిమా కపూర్
- నీతూ కపూర్, రణ్‌బీర్ కపూర్‌కు కరోనా అంటూ ప్రచారం
- మండిపడ్డ డిజైనర్ రిద్దిమా కపూర్ సాహ్ని
- అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి
'ఈ వార్తల్లో నిజం లేదు. కరోనా విపత్కర సమయంలోనయినా ఇటువంటి రూమర్లను వ్యాప్తి చేయడం దయచేసి ఆపండి. మేము పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నాము' అని రిదిమా చెప్పింది. కాగా, ఇటీవల రిదిమా ఇచ్చిన ఓ బర్త్ డే పార్టీకి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద హాజరయ్యారని, ఆ తర్వాతే అమితాబ్‌కు కరోనా సోకిందని అసత్య వార్తలు వస్తున్నాయి.