పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని దుల్ఖర్ చెప్పేవాడు: నిత్యా మీనన్
- దుల్ఖర్ పూర్తిగా ఫ్యామిలీ పర్సన్
- కుటుంబానికి ఎంతో విలువ ఇస్తాడు
- మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది
తాజాగా ఓ తమిళ పత్రికకు నిత్య ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా దుల్ఖర్ స్నేహ స్వభావాన్ని ఎంతగానో కొనియాడింది. దుల్ఖర్ పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అని... తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు ఎంతో విలువ ఇస్తాడని చెప్పింది. పెళ్లి చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని... తనను కూడా పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు మోటివేట్ చేశాడని తెలిపింది. సినిమాల విషయానికి వస్తే తమ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని... 'ఓకే బంగారం' సినిమాలో తెరపై తమను తాము చూసుకుని ఆశ్చర్యపోయామని చెప్పింది.