కొవిడ్-19 బారిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సుధ
- సూర్యగ్రహణం రోజున పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
- అక్కడే వైరస్ సోకి ఉంటుందని అనుమానం
- ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు క్వారంటైన్‌కు తరలింపు
సూర్యగ్రహణం రోజున ఎమ్మెల్యే పాల్గొన్న పూజా కార్యక్రమాలకు 200 మందికిపైగా హాజరయ్యారు. బహుశా అక్కడే ఆయనకు కరోనా వైరస్ సంక్రమించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, హర్యానాలో ఇప్పటి వరకు 13,829 కరోనా వైరస్ కేసులు వెలుగుచూశాయి. అలాగే, 223 మంది కొవిడ్ కారణంగా మృతిచెందారు.