బిడ్డకు జన్మనిచ్చాననే వార్తలు చూసి కృంగిపోయాను: కన్నడ నటి నేహ గౌడ్
- ఇలాంటి వార్తలు రాసేవారు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదు
- అలాంటి వారు ఏదో ఒక రోజు మనోవేదనకు గురవుతారు
- వార్త రాసేముందు ఒకసారి నిర్ధారించుకుంటే బాగుంటుంది
ఓ వార్త రాసేటప్పుడు ఎవరి గురించి రాస్తున్నారో వారిని ఒకసారి అడిగితే బాగుంటుందని నేహ గౌడ అన్నారు. తన గురించి వార్త రాసేటప్పుడు తననో, తన కుటుంబసభ్యులనో అడిగితే బాగుండేదని చెప్పారు. ఇలాంటి వార్తలు రాసేముందు మీకు కూడా ఓ అమ్మ, ఓ అక్క, ఓ స్నేహితురాలు ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
నటనారంగంలోకి రాకముందు నేహ ఎయిర్ హోస్టెస్ గా పని చేశారు. పలు కన్నడ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపును తెచ్చుకున్నారు. కన్నడతో పాటు తమిళం, మలయాళం, తెలుగులో కూడా ఆమె నటించారు.