వర్మపై అమృత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: బాలస్వామి వివరణ
- 'మర్డర్' సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన వర్మ
- ఆత్మహత్య చేసుకోవాలనిపించిందన్న అమృత
- ఇది నిజమైన స్టోరీ అని చెప్పలేదన్న వర్మ
మరోవైపు ఈ అంశంపై అమృత మామగారు బాలస్వామి స్పందించారు. అమృత పేరిట సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని ఆయన చెప్పారు. వర్మ సినిమాపై అమృత స్పందించలేదని అన్నారు. ఆమె పేరుపై వస్తున్న స్టేట్మెంట్లను నమ్మొద్దని కోరారు.
మరోవైపు, ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించనున్నారు. రామ్ గోపాల్ వర్మ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు నట్టి క్రాంతి, నట్టి రుణ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.