సుశాంత్ డిప్రెషన్ పై ఆయన తండ్రి కేకే సింగ్ స్పందన
- సుశాంత్ డిప్రెషన్ తో బాధ పడుతున్నట్టు మాకు తెలియదు
- డిప్రెషన్ కు ఎందుకు గురయ్యాడో తెలియదు
- మేము ఎవరినీ అనుమానించడం లేదు
ఈ సందర్భంగా కేకే సింగ్ మాట్లాడుతూ, సుశాంత్ డిప్రెషన్ తో బాధ పడుతున్నట్టు తనకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ తెలియదని చెప్పారు. తన కుమారుడు డిప్రెషన్ కు ఎందుకు గురయ్యాడో తెలియదని అన్నారు. సుశాంత్ మరణం విషయంలో తాము ఎవరినీ అనుమానించడం లేదని చెప్పారు. మరోవైపు పోలీసులు ప్రస్తుతం సుశాంత్ మేనేజర్, స్నేహితులను విచారిస్తున్నారు.