కరోనా బారినపడిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
- తెలంగాణ ఎమ్మెల్యేలలో తొలి కేసు
- అనుమానంతో పరీక్ష చేయించుకుంటే పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి
కాగా, తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 164 కేసులు నమోదయ్యాయి. 9 మంది మరణించారు. నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 133 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,484 కేసులు నమోదు కాగా, 174 మంది మరణించారు. 2,032 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.