భార్య తిడుతోందని లైవ్ ఆపేసి వెళ్లిపోయిన హీరో రణవీర్ సింగ్
- లాక్ డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉన్న దీపికా పదుకునే, రణవీర్
- ఆయుష్మాన్ తో ఇన్స్టా లైవ్ లో ముచ్చటించిన రణవీర్
- దీపిక తిట్టడంతో లైవ్ ఆపేసిన వైనం
ఇద్దరి మధ్య చాలా ఫన్నీగా ముచ్చట్లు కొనసాగుతున్న సమయంలో... 'ఓకే ఆయుష్మాన్, ఇక నేనుంటాను' అని రణవీర్ చెప్పాడు. అప్పుడే ఎందుకు అని ఆయుష్మాన్ ప్రశ్నించాడు. మీ వదిన జూమ్ చాట్ లో ఉందని, గట్టిగా మాట్లాడొద్దని తిడుతోందని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత లైవ్ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అభిమానులతో ఆయుష్మాన్ లైవ్ కొనసాగించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.