నమ్మలేని విధంగా నారా రోహిత్ న్యూ లుక్...నెటిజన్ల ఫిదా!
- ఇటీవల ట్విట్టర్ లోకి ప్రవేశించిన రోహిత్
- కొత్త లుక్ ను పోస్ట్ చేయడంతో వైరల్
- కాలేజ్ స్టూడెంట్ లా కనిపిస్తున్నాడని కితాబు
మీసాలు లేకుండా, కూల్ గా కనిపిస్తున్న రోహిత్ చిత్రం వైరల్ అవుతోంది. త్వరలో ఆయన కొత్త చిత్రం ప్రారంభం కానుండగా, ఆ సినిమాకు సంబంధించినదే ఈ లుక్ అని సమాచారం. అంతకుముందు ఓ పవర్ ఫుల్ పోలీసు అధికారి స్టయిల్ లో మీసాలతో ఉన్న మరో పిక్ ను రోహిత్ పోస్ట్ చేయగా, అది కూడా అభిమానులను అలరించింది.