ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకుని నాగ్ అశ్విన్ రాసిన కథ ఇది: నిర్మాత అశ్వనీదత్
- మా సంస్థ నుంచి మరో భారీ చిత్రం
- ప్రభాస్ వెంటనే అంగీకరించాడు
- అక్టోబర్లో రెగ్యులర్ షూటింగు మొదలు
'జగదేకవీరుడు అతిలోక సుందరి' తరువాత మా సంస్థ నుంచి మరో ఫాంటసీ చిత్రం రాబోతోంది. ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకుని నాగ్ అశ్విన్ ఈ కథను సిద్ధం చేశాడు. నాగ్ అశ్విన్ కథ చెబుతున్నప్పుడు, ప్రభాస్ అయితేనే కరెక్ట్ అని నాకు కూడా అనిపించింది. క్రేజ్ పరంగా, మార్కెట్ పరంగా, ఇతర భాషా ప్రేక్షకులకు ఈ కథ చేరువకావడానికిగాను ప్రభాస్ ను తీసుకోవడమే సరైన నిర్ణయం అనిపించింది. ఒకసారి కథ వినగానే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని బట్టి కథ ఎంత పెర్ఫెక్ట్ గా వచ్చిందనేది అర్థం చేసుకోవచ్చు. మా సంస్థ నుంచి ఒక అద్భుతమైన చిత్రం రానుందనే విషయాన్ని నమ్మకంగా చెప్పగలను. అక్టోబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయనున్నాము" అని చెప్పుకొచ్చారు.