చిరంజీవి గారు.. యాక్షన్ ప్లాన్ కావాలి: నాగార్జున
- విజయ్ దేవరకొండకు పెరుగుతున్న మద్దతు
- అండగా ఉన్నందుకు చిరుకు అభినందనలు తెలిపిన నాగ్
- అయితే కేవలం అండగా ఉంటే సరిపోదని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో నాగార్జున కూడా స్పందించారు. చిరంజీవి ట్వీట్ పై ఆయన స్పందిస్తూ... సినీ పరిశ్రమలోని సహచరుడికి అండగా నిలబడటం అభినందనీయమని కొనియాడారు. మహేశ్, రవితేజ, రానా, కొరటాల శివ, క్రిష్, వంశీ పైడిపల్లి అందరూ నీకు అండగా ఉన్నారని విజయ్ దేవరకొండకు భరోసా కల్పించారు.
అయితే, కేవలం అండగా ఉంటే సరిపోదని... ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు మనకు ఒక యాక్షన్ ప్లాన్ కావాలని నాగార్జున ట్వీట్ చేశారు.