అదంతా పుకారేనంటున్న యంగ్ హీరో
- సెట్స్ పైకి వెళ్లనున్న బోయపాటి సినిమా
- నవీన్ పోలిశెట్టి ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడంటూ టాక్
- కొట్టి పారేసిన నవీన్ పోలిశెట్టి
పూర్తి వినోదభరితమైన ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ - బోయపాటి సినిమాలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నట్టుగా రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ .. "బోయపాటి సినిమాకి సంబంధించి ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఈ సినిమాలో నేను చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అదంతా కేవలం పుకారు మాత్రమే" అంటూ జోరుగా జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించేశాడు.