మీరు ఎప్పుడు ప్రధాని అవుతారు? అన్న ప్రశ్నకు అమితాబ్ బచ్చన్ సమాధానం!
- అభిమానులతో బిగ్ బీ ఛాటింగ్
- ఉదయాన్నే పవిత్రమైన విషయాలు మాట్లాడొచ్చు కదా అంటూ రిప్లై
- ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోన్న అమితాబ్
ఈ సందర్భంగా ఓ అభిమాని 'సర్.. మీరు దేశానికి ప్రధానమంత్రి ఎప్పుడు అవుతారు?' అంటూ అడిగారు. దీనికి అమితాబ్ స్పందిస్తూ... 'అరె యార్... ఉదయాన్నే పవిత్రమైన విషయాలు మాట్లాడొచ్చు కదా' అంటూ చమత్కారంగా సమాధానమిచ్చారు.
కాగా, అమితాబ్ బచ్చన్ 1980ల్లో రాజకీయాల్లోనూ ప్రవేశించారు. 1984లో అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే, మూడేళ్ల తర్వాత రాజీనామా చేశారు. అమితాబ్ బచ్చన్ ఈ వయసులోనూ బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఏ భారతీయ నటుడుకీ లేనంత మంది ఫాలోవర్లు ఆయనకు ఉన్నారు.