Nani: 'హిట్' దర్శకుడు శైలేశ్ కొలనుతో నాని

Sailesh Kolanu Movie

  • 'హిట్' సినిమాతో శైలేశ్ కొలనుకు ఛాన్స్ ఇచ్చిన నాని
  • నాని నమ్మకాన్ని నిలబెట్టుకున్న దర్శకుడు
  • ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమాకు సన్నాహాలు  

నాని కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వి' సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన 'శ్యామ్ సింగ రాయ్'ను లైన్లో పెట్టేశాడు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకుడు శైలేశ్ కొలనుకు అవకాశం ఇచ్చినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త వినిపిస్తోంది.

కొత్త దర్శకులతో చేయడానికి నాని మొదటి నుంచి ఆసక్తిని కనబరుస్తూనే వస్తున్నాడు. అలాగే శైలేశ్ కొలనుకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ ఆయన ఇటీవల 'హిట్' సినిమాను నిర్మించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న శైలేశ్ కొలను, రీసెంట్ గా నానీకి ఒక కథ వినిపించాడట. ఆ కథ నానీకి నచ్చడంతో, పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని రమ్మని చెప్పాడని అంటున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువనే టాక్ వినిపిస్తోంది.

Nani
Sailesh Kolanu
Tollywood
  • Loading...

More Telugu News