నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో భూమిక!
- హీరోయిన్ గా భూమికకు మంచి పేరు
- రీ ఎంట్రీలో కీలకమైన పాత్రలు
- బాలకృష్ణ మూవీలో మరోసారి ఛాన్స్
ఈ మధ్య వచ్చిన 'రూలర్' సినిమాలోనూ భూమిక నటించింది. ఆ తరువాత బాలకృష్ణ చేస్తున్న సినిమాలోను ఆమెకి ఛాన్స్ దొరకడం విశేషం. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం భూమికను తీసుకున్నారట. ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగినదిగా ఉంటుందని చెబుతున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.