బన్నీ కెరియర్లోనే మొదటిసారి .. ఐదు భాషల్లో రిలీజ్ కానున్న 'పుష్ప'
- స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ
- చిత్తూరు యాస మాట్లాడే బన్నీ
- సుకుమార్ టేకింగ్ పై ఆసక్తి
తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. బన్నీ కెరియర్లో ఒకేసారి ఐదు భాషల్లో విడుదలకానున్న తొలి సినిమా ఇదే. అలాగే అడవి నేపథ్యంలో .. చిత్తూరు యాసలో మాట్లాడే మాస్ యువకుడిగా ఆయన ఈ రోల్ చేయడం కూడా ఇదే మొదటిసారి. ఆయన పాత్రను సుకుమార్ తీర్చిదిద్దిన తీరుపైనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక కనిపించనున్న సంగతి తెలిసిందే.