త్రివిక్రమ్ వైపు మొగ్గుచూపుతున్న మహేశ్ బాబు
- పరాజయం పాలైన 'ఖలేజా'
- బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'అతడు'
- మరో ప్రాజక్టుకు ప్రయత్నాలు
అయితే ఈ రెండు సినిమాలు వచ్చి చాలా కాలమే అయినా, త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో ఇంతవరకు మరో సినిమా రాలేదు. అందుకు కారణాలు ఏమైనా, మరోసారి త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి మహేశ్ బాబు మొగ్గుచూపుతున్నాడని అంటున్నారు. ఆ దిశగా కొన్ని సంకేతాలు కూడా పంపుతున్నాడని చెబుతున్నారు.
ఇంతకుముందు ఎన్టీఆర్ .. ఆ తరువాత బన్నీ .. త్రివిక్రమ్ కోసం వెయిట్ చేసి మరీ ఆయనతో సినిమాలు చేశారు .. విజయాలను అందుకున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో మరో ప్రాజెక్టును సెట్ చేయడానికి మహేశ్ బాబు వైపు నుంచి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.