పీఎం కేర్స్ ఫండ్ కు రూ.25 కోట్ల భారీ విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్
- పీఎం కేర్స్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలని మోదీ విజ్ఞప్తి
- ప్రధాని పిలుపుకు స్పందించిన బాలీవుడ్ స్టార్
- ప్రాణాలుంటేనే జీవించగలమని అక్షయ్ వ్యాఖ్యలు
మనవాళ్ల కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని, తాను పొదుపు చేసిన డబ్బు నుంచి పాతిక కోట్ల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నానని తెలిపారు. "మనం ప్రాణాలను కాపాడుదాం. ప్రాణాలుంటేనే జీవించగలం" అంటూ స్పందించారు.