ధైర్యంగా ఉండండి.. జాగ్రత్తలు పాటించండి: నటుడు నాగబాబు
- జనతా కర్ఫ్యూను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు
- ‘కరోనా’ నివారణ కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు
- ప్రజలకు ధైర్యం చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసిన నాగబాబు
‘కరోనా’ నివారణ కోసం పాటుపడుతున్న.. ముఖ్యంగా, వైద్యులు, వైద్య సిబ్బందికి, పోలీసులు, అధికారులకు తన హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు. జీవితం గురించి భయపడొద్దని, ఆందోళన చెందవద్దని ప్రజలకు నాగబాబు ధైర్యం చెప్పారు. ఓ బాధ్యత గల పౌరుడిగా ఓ వీడియోను షేర్ చేస్తున్నానని, దీని ద్వారా తన ఆలోచనలు పంచుకుంటున్నానని అన్నారు.