లేడీ విలన్ గా కనిపించనున్న భూమిక
- కేరక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలు
- నెగెటివ్ పాత్రల పట్ల ఆసక్తి
- స్టార్ హీరో సినిమాలో లేడీ విలన్ గా అవకాశం
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తెలుగులో తను ఒక స్టార్ హీరో సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తున్నట్టుగా చెప్పింది. నెగెటివ్ షేడ్స్ తో కూడిన లేడీ విలన్ గా తను కనిపిస్తానని అంది. ఈ తరహా పాత్రను చేయాలనే తను చాలాకాలం నుంచి అనుకుంటున్నాననీ, అలాంటి పాత్ర పడటం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ఆ సినిమా ఏమిటి? అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.