వేషాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను: యాంకర్ ప్రదీప్
- ఎంబీఏ చేయడం నాకు ఇష్టం లేదు
- మా నాన్నగారిని ఏడాది సమయం అడిగాను
- తొలిసారిగా చేసిన సినిమా'మనోరమ' అని చెప్పిన ప్రదీప్
'నాకు నచ్చిన కెరియర్ ను ఎంచుకుంటాను .. ఒక ఏడాది సమయం ఇవ్వండి' అని మా నాన్నగారిని అడిగాను. ఆయన 'సరే' అనడంతో వెంటనే రంగంలోకి దిగిపోయాను. మంచి మంచి ఫొటోలు దిగేసి, వాటిని పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. తొలిసారిగా నేను 'మనోరమ' సినిమా కోసం కెమెరా ముందుకు వెళ్లాను. చిన్న పాత్రే అయినా, 'అత్తారింటికి దారేది' నాకు మంచి పేరు తీసుకొచ్చింది" అని చెప్పుకొచ్చాడు.