అయినా ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే: నాగబాబు
- ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా గురించి నాగబాబు వ్యాఖ్యలు
- కొన్ని ప్రముఖ మతాల పెద్దల వ్యాఖ్యలపై సెటైర్
- కరోనాను వాళ్ల దేవుడే భూమి మీదకి పంపించాడట అంటూ ట్వీట్
కాగా, కరోనా వైరస్ చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మత పెద్దలు విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 'మాంసాహారులను దండించడానికి దేవుడు ధరించిన కోపావతారమే కరోనా వైరస్' అని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి ఇటీవలే వ్యాఖ్యానించారు.