'దిల్' రాజు సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్ కి భారీ పారితోషికం
- నాలుగు భాషా చిత్రాలలో అనుపమ
- 'దిల్' రాజు నిర్మాణంలో మరో సినిమా
- హీరోగా ఆశిష్ రెడ్డి పరిచయం
తాజాగా ఆమె తెలుగులో మరో సినిమాను అంగీకరించింది. 'దిల్' రాజు తన సోదరుడి తనయుడైన ఆశిష్ రెడ్డి హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి 'రౌడీ బాయ్స్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. కథానాయిక పాత్రకి అనుపమ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమా కోసం అనుపమకి భారీ పారితోషికమే ముడుతున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.