తిరుపతిలో 'కార్తికేయ 2' మూవీ లాంచ్
- గతంలో వచ్చిన 'కార్తికేయ' హిట్
- ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్
- త్వరలోనే మిగతా వివరాల వెల్లడి
ఈ రోజున తిరుమలలో ఈ సినిమాను లాంచ్ చేశారు. ఉగాది నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కొంతకాలంగా తాము ఎదురుచూస్తున్న సరైన హిట్, ఈ సినిమాతో పడుతుందనే ఉద్దేశంతో చందూ .. నిఖిల్ వున్నారు. ద్వాపర యుగం నాటి ఓ రహస్యాన్ని కలియుగంలో ఛేదించే పాయింట్ తో రూపొందుతున్న ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేపుతోంది.