కూతురు సక్సెస్ పై అమితాబ్ భావోద్వేగ సందేశం..
- వస్త్ర వ్యాపారంలోకి శ్వేతా బచ్చన్
- ఎమ్ ఎక్స్ ఎన్ బ్రాండ్ నేమ్ తో కొత్త డిజైనర్ వేర్
- తొలి లగ్జరీ కలెక్షన్ విడుదల
- శ్వేత ఘనతను కొనియాడిన బిగ్ బి
కూతురు సాధించిన ఘనతపై ఆనందం వ్యక్తం చేసిన అమితాబ్.. ఈ ఈవెంట్ కు సబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి భావోద్వేగ సందేశం రాసుకొచ్చారు. ‘కీర్తి, గౌరవం లభించిన రోజు ఇది. మన పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు, వాళ్లు ఏదైనా సాధించినప్పుడు, మనకు ఆనందభాష్పాలు తెప్పించినప్పుడు, వాళ్ల సయంకృషి ఫలితాన్ని ఇచ్చినప్పుడు, ఈ ప్రపంచం వాళ్ల శ్రమను గుర్తించి మెచ్చుకున్నప్పుడు మన ముఖంలో మెరుపు కనిపిస్తుంది. మా అందరినీ గర్వపడేలా చేసినందుకు లవ్ యూ శ్వేతా’ అని పోస్ట్ చేశారు. అలాగే, శ్వేత చిన్నప్పటి ఫొటో, ఇప్పటి ఫొటో కూడా షేర్ చేశారు. చిన్నారి శ్వేత ఎప్పుడు ఇంత పెద్దది అయిందో తెలియడం లేదని రాసుకొచ్చారు.