తనికెళ్ల భరణి నుంచి మరో వైవిధ్యభరిత చిత్రం .. 'అద్భుతః'!
- రచయితగా తనదైన మార్కు
- నటుడిగా విభిన్నమైన పాత్రలు
- దర్శకుడిగా ప్రయోగాలు చేస్తున్న భరణి
తాను చెప్పదలచుకున్న విషయాన్ని చాలా తక్కువ పాత్రలతో సందేశాత్మకంగా చెప్పడం తనికెళ్ల భరణి ప్రత్యేకత. ఇదే తరహాలో ఆయన మరో కథను సెట్స్ పైకి తీసుకెళ్లి చిత్రీకరణను పూర్తి చేశారు .. ఈ సినిమా పేరే 'అద్భుతః'. వినోదం .. సందేశం కలగలిసిన ఈ కథను ఓ ప్రయోగాత్మక చిత్రంగా ఆయన తీర్చిదిద్దారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాను, త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో వున్నారు.