నేను, వితిక అలా ప్రేమలో పడ్డాము: హీరో వరుణ్ సందేశ్
- ఆ సినిమాలో కలిసి నటించాము
- ఒక సీన్లో ఇద్దరమూ పడిపోయాము
- వితిక విషయంలో కంగారు పడ్డానన్న వరుణ్ సందేశ్
'మేము ఇద్దరం హీరో హీరోయిన్లుగా 'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమా చేశాము. అప్పటికి రెండు నెలలుగా షూటింగ్ జరుగుతున్నా పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ ఒక సీన్లో నేను వితికాను ఎత్తుకుని పరిగెత్తాలి. ఆ సమయంలో తనని పడేసి .. నేను పడిపోయాను. ఆ అమ్మాయి నడుముకి బలమైన దెబ్బ తగిలి ఉంటుందని భావించి కంగారుపడ్డాను. ఆ రోజు నుంచి ఆమెకి కాల్ చేసి ఎలా వున్నారని కనుక్కోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది .. అది అలా పెళ్లికి దారితీసింది" అని చెప్పుకొచ్చాడు.