గత ప్రభుత్వం సంపాదించిన ఆస్తులను అమ్ముతూ పాలిస్తున్నారు: తులసి రెడ్డి
- వైసీపీది రౌడీ పాలన
- పిచ్చోడి చేతికి ఏకే47 ఇచ్చినట్టుంది
- 7 నెలల్లో రూ. 35 వేల కోట్ల అప్పులు చేశారు
మూడు రాజధానులు అనేది ఒక అవివేకమైన నిర్ణయమని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కోడికత్తి కేసు కానీ, వైయస్ వివేకా హత్య కేసు కానీ తేలలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామని చెప్పారు. పార్టీకి మళ్లీ పునర్వైభవాన్ని తీసుకొస్తామని అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.