'జాను' విడుదల తేదీ ఖరారు
తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ముందుగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ రోజున 'వరల్డ్ ఫేమస్ లవర్' ఉండటంతో, వారం రోజుల ముందుగానే విడుదల చేస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో ఈ కథ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.