10 రోజుల్లో 101 కోట్ల షేర్ .. తెలుగు రాష్ట్రాల్లో మహేశ్ దూకుడు
- సంక్రాంతి కానుకగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'
- నైజామ్ లో అత్యధిక వసూళ్లు
- హైలైట్ గా నిలిచిన దేవిశ్రీ సంగీతం
ఒక్క నైజాంలోనే ఈ సినిమా 33 కోట్ల షేర్ ను సాధించి, మహేశ్ కెరియర్లో నైజామ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డును నమోదు చేసింది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమా లాభాల బాటలో పరుగులు తీస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ .. మహేశ్ మార్క్ యాక్షన్ .. విజయశాంతి వైపు నుంచి ఎమోషన్ .. దేవిశ్రీ అందించిన సంగీతం ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.