మళ్లీ సంక్రాంతికి ఎన్టీఆర్ తో రానున్న త్రివిక్రమ్
- గతంలో హిట్ చిత్రంగా నిలిచిన 'అరవింద సమేత'
- ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమాకి సన్నాహాలు
- ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి
పూర్తి స్క్రిప్ట్ ను ఏప్రిల్ నాటికి సిద్ధం చేసుకుని, సెట్స్ పైకి వెళ్లేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు. ఈ కథలో యాక్షన్ పాళ్లు తక్కువ .. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దాదాపు జంధ్యాల సినిమాలను గుర్తుచేసేలా ఈ కథ ఉంటుందని చెబుతున్నారు. ఈ నెలలోనే ఈ ప్రాజెక్టును గురించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.