'ఫైటర్'ను రంగంలోకి దింపిన పూరి
- ముంబైలో పూజా కార్యక్రమాలు
- తెలుగుతో పాటు హిందీలోను నిర్మాణం
- కథానాయికగా 'అనన్య పాండే' పరిచయం
కొంతసేపటి క్రితం ముంబైలో ఈ సినిమాను లాంచ్ చేశారు. పూరి జగన్నాథ్ కి ఇది 37వ సినిమాకాగా, విజయ్ దేవరకొండకి ఇది 10వ సినిమా. ఇటు పూరి జగన్నాథ్ కి .. అటు విజయ్ దేవరకొండకి యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతుండటం పట్ల అందరూ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా 'అనన్య పాండే' పేరు వినిపిస్తోంది.