తెలుగు తెరకి త్వరలో నా కూతురిని పరిచయం చేస్తాను: సీనియర్ హీరో అర్జున్
- తెలుగులో అందుకే గ్యాప్ వచ్చింది
- ఒకప్పుడు ఒక సినిమా నెలలో పూర్తయ్యేది
- తెలుగు మూవీకి దర్శకత్వం వహిస్తానన్న అర్జున్
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "వీలును బట్టి నేను తెలుగు .. తమిళ .. కన్నడ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. ఒకప్పుడు ఒక సినిమా నెల రోజుల్లో పూర్తయ్యేది. ఇప్పుడు 3 నెలలకి పైగా సమయం పడుతోంది. అందువలన గ్యాప్ వచ్చినట్టుగా అనిపిస్తోంది. మా అమ్మాయి 'ఐశ్వర్య' తమిళంలో విశాల్ జోడీగా చేసింది. తనని కన్నడ చిత్ర పరిశ్రమకి నా దర్శకత్వంలోనే పరిచయం చేశాను. ఈ ఏడాది తనని తెలుగు తెరకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను. తను హీరోయిన్ గా నా దర్శకత్వంలోనే ఆ సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.