హైటెక్ సిటీ ప్రాంతంలో విజయ్ దేవరకొండ షూటింగ్
- 'వరల్డ్ ఫేమస్ లవర్'గా విజయ్ దేవరకొండ
- తొలిసారిగా డబ్బింగ్ చెప్పనున్న రాశి ఖన్నా
- ఫిబ్రవరి 14వ తేదీన సినిమా విడుదల
ప్రస్తుతం హైదరాబాద్ - హైటెక్ సిటీ ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో క్లైమాక్స్ తాలూకు సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజుల పాటు అక్కడే షూటింగు జరగనున్నట్టుగా తెలుస్తోంది. తొలిసారిగా రాశి ఖన్నా తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పనుంది. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ప్రేమికుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు.