శేఖర్ కమ్ముల సినిమాకి విడుదల తేదీ ఖరారు
- చైతూ - సాయిపల్లవి జోడీగా 'లవ్ స్టోరీ'
- తెలంగాణ యువకుడిగా చైతూ
- ఏప్రిల్ 2వ తేదీన విడుదల
ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. నారాయణదాస్ నారంగ్ .. రామ్మోహనరావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో చైతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడిగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనిపించనున్నాడు. విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.