చిరంజీవి ఇంట్లో 80వ దశకం తారల కోలాహలం!
- ప్రతి ఏటా కలుస్తున్న 80ల నాటి తారలు
- ఈసారి చిరంజీవి ఇంట్లో వేడుకలు
- రెండ్రోజుల పాటు ఆటపాటలు
తాజాగా మరోసారి కోలాహలం సృష్టించేందుకు అందరూ హైదరాబాద్ చేరుకున్నారు. ఈసారి వారి వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే చిరు తన నివాసాన్ని అపురూపమైన అతిథుల కోసం సిద్ధం చేశారు. రెండ్రోజుల పాటు తారలు చిరు ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడమే కాదు, ఆటపాటలు, ర్యాంప్ వాక్ లు, ఇతర కార్యక్రమాలతో హాయిగా ఆస్వాదించనున్నారు.